ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి: రాములు నాయక్‌


నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో కలిసి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గిరిజన నాయకుడిగా తనకు గుర్తింపు ఉందని, ఈ మూడు జిల్లాల్లో ఉన్న గిరిజన ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్‌ విజ్ఞప్తి చేశారు.