చికిత్స‌కు స్పందిస్తున్న ఎస్పీ బాలు


కొద్ది రోజులుగా క‌రోనాతో పోరాడుతున్న గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి సోమ‌వారం నెగెటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని తెలిపారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్న‌ట్లు ఎస్పీ చ‌ర‌ణ్ తెలిపారు. కాగా వారాంతంలో ఎస్పీ బాలు దంపతులు పెళ్లి రోజును కూడా జ‌రుపుకున్నారు. బాలు కోలుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.