అఖిల కథ


జయసింహా, అక్ష జంటగా నటించనున్న చిత్రం ‘అఖిల’. మోహన్‌ రావ్‌ దర్శకత్వం వహించనున్నారు. జై చిరంజీవ ఫిలింస్‌ పతాకంపై శెట్టి చిరంజీవి నిర్మించనున్న ఈ చిత్రం టైటిల్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్‌ విడుదల చేశారు. మోహన్‌ రావ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జయసింహ, హీరోయిన్‌ అక్ష పాత్రలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించనున్నారు శెట్టి చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘మోహన్‌ రావుగారు చెప్పిన పాయింట్‌ బాగుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శెట్టి చిరంజీవి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ‘అఖిల’ సినిమాతో నాకు మంచి పేరు లభిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు అక్ష. ‘‘అఖిల’ సినిమాతో తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరి సహకారం నాకు కావాలి’’ అన్నారు జయసింహా. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌ కిరణ్, కెమెరా: శేఖర్‌.