నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్‌


అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పెద్ద హామీ శుక్రవారం నుంచి అమలు కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల రోజు నాటికి (2019 ఏప్రిల్‌ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.