మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ పనుల ప్రగతిపై సైట్ వద్ద సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంపై ఆరా తీశారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కనకరత్నం, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాంచంద్రం, పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, తహశీల్ధార్లు అన్వర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.