బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..


‘‘టీఆర్ఎస్ చేతల పార్టీ అని, బీజేపీ మాయ మాటల పార్టీ’’ అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా.. హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్‌లో గురువారం ఉదయం మండలంలోని 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను, అధిక వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.