శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్‌


చౌమహల్లా ప్యాలెస్‌ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్‌ సందర్శనను ట్రస్ట్‌ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సందర్శన వేళలు, మార్గం ఎలా వెళ్లాలి: చార్మినార్‌ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్‌ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్‌ వస్తుంది. సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. సెలవు: శుక్రవారం. టికెట్‌ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200 రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్‌: ప్యాలెస్‌ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్‌ సౌకర్యం కలదు.