బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో నటి రియా చక్రవర్తి అరెస్టు అయిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసు విచారణలో ఆరోపణలు ఎదర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను నార్కోటిక్స్ కంటట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. అయితే డ్రగ్ కేసులో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది.