కోవిడ్–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మనోగతం అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యయనంలో తేలింది. ‘95% కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 90–100% ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తు్తన్నారు. రెండు నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగింది.