గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు


చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్పీబి శుక్రవారం అందర్నీ వీడి అనంతలోకాలకు పయనమయ్యారు. ఈ సమాచారం యావత్‌ సంగీత ప్రపంచాన్ని, అభిమానలోకాన్ని కన్నీటి సాగరంలో ముంచింది. ఆస్పత్రి నుంచి చెన్నై నుంగంబాక్కంలోని నివాసంలో ఆయన పారి్థవదేహాన్ని ఉంచారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం వద్ద వున్న ఎస్‌పీబీ గార్డెన్‌కు పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిమానులు, ఆప్తులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. గాన గంధర్వుడి కడచూపుకోసం అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి.