స్పీడ్‌ పెంచారు


‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌తో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌. తొలి సినిమాకే నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాలు అంగీకరించడంలో స్పీడ్‌ పెంచాడు ధ్రువ్‌. రెండో సినిమాను తండ్రి విక్రమ్‌తో కలసి చేస్తున్నట్టు ప్రకటించాడు. ధ్రువ్, విక్రమ్‌ ముఖ్య పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ధ్రువ్‌ విక్రమ్‌ సోలో హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘పరియేరు పెరుమాళ్, కర్ణన్‌’ చిత్రాలను తెరకెక్కించిన మారీ సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధ్రువ్‌ ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. తండ్రితో చేస్తున్న సినిమా, తాజాగా ఒప్పుకున్న ఈ సినిమాను ఏకకాలంలో పూర్తి చేస్తాడట ధ్రువ్‌.