ఆరు బంతులు.. ఆరు రకాలుగా


జస్‌ప్రీత్‌ బుమ్రా.. వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌కు పెట్టింది పేరు. మలింగ తర్వాత యార్కర్ల వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సెస్టెంబర్‌ 19న చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.