సందిగ్ధంలో థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ


ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది.