ఆదిపురుష్‌లో సీతగా.. క్లారిటీ ఇచ్చిన అనుష్క


తాన్హాజీ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించబోయే చిత్రం ఆదిపురుష్‌. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. రామాయణం కథాంశంతో 3డీలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి నటించబోతుందని అనేక వార్తలు వెలువడ్డాయి. రాముడిగా కనిపించనున్న ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో స్వీటీ నటించనుందని, ఈ విషయంపై ఇప్పటికే అనుష్కను చిత్ర యూనిట్‌ సంప్రదించినట్లు పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై అనుష్క స్పందించారు. తాను ఆదిపురుష్‌ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పేశారు.