నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌


సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు గారాల త‌న‌య సితార ఎప్పటిక‌ప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రి న‌టించిన హిట్ సినిమాల్లోని పాట‌ల‌కు స్టెప్పులేసిన వీడియోలైతే ఎంత‌గానో వైర‌ల్ అయ్యాయి. తాజాగా పాట‌లు, డ్యాన్సులకు బ‌దులుగా త‌న గుండెలో క‌ల‌కాలం నిలిచిపోయిన ఓ పాత ఫొటోను షేర్ చేసుకుంది. ఇందులో కుర్చీలో వాలిపోయిన మ‌హేశ్ మెడ చుట్టూ చేతులు వేసి హాయిగా కునుకు తీస్తోంది.