బిగ్‌బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. అసలే నిన్న ఐపీఎల్ ప్రారంభం కావడంతో చాలామంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ గేమ్ మార్చాడు. డబుల్ ఎలిమినేషన్ అంటూ అందరిలో ఆసక్తి రేపాడు. మరోవైపు హీరో-జీరో గేమ్‌లో శ్రుతి మించిన కామెడీ అని లాస్య.. అమ్మ రాజశేఖర్‌ను జీరోగా పేర్కొంది. అక్కడితో ఆగకుండా ఓ ఫొటో షూట్ కోసం దివి ప్రెగ్నెంట్‌గా కనిపించేందుకు రాజశేఖర్ స్వయంగా ఆమెకు పిల్లో సర్దడం తనకు కరెక్ట్ అనిపించలేదని చెప్పుకొచ్చింది దివి పట్ల ఆయన అలా ప్రవర్తించాల్సింది కాదని చెప్పడంతో మాస్టర్ తట్టుకోలేకపోయాడు. తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, అది టాస్క్ కోసం హడావుడిలో చేశానని చెప్పుకుంటూ ఏడ్చేశాడు.