రూపాయి పుంజుకున్నా ఫలితం లేదు

 


 ట్రేడింగ్‌ చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్‌ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 73.45కు చేరినా, స్టాక్‌ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 134 పాయింట్లు పతనమై 38,846 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టంతో 11,505 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. ఫార్మా షేర్ల జోరు మాత్రం కొనసాగుతోంది. పలు ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 9 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడింది.