వేధించే స్కూళ్లకు పాఠం


‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్‌కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్‌ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్‌కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్‌పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్‌గా, స్కూల్‌ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు.