టీచర్ల మర్యాదకు కారణమదే: దీపిక


బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపిక పదుకొణే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటు తన అభిరుచులను పంచుకుంటారు. తాజాగా ఓ టీవీ షోలో తన చిన్ననాటి జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను స్కూల్ చదివే రోజుల్లో టీచర్లెప్పుడు తనను శిక్షించలేదని, కాగా తాను లెజండరీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్‌ పదుకునే కూతురు కావడంతో టీచర్లందరు తనకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని పేర్కొన్నారు. టీచర్లందరు తన తండ్రి ప్రకాశ్‌ పదుకునే అభిమానులు కావడంతో తనను ప్రత్యేకంగా చూసేవారని తెలిపారు. అయితే టీచర్ల తనను శిక్షించకపోవడానికి తన జీవన విధానమే కారణమని పేర్కొన్నారు. క్రీడాకారుడి కూతురిని కాబట్టి చిన్నతనంలో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకున్నట్లు తెలిపారు. తాను ఉదయం 4 గంటలకు నిద్ర లేచి బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌కు వెళ్లానని తెలిపారు. ప్రాక్టీస్‌ అవ్వగానే స్కూల్‌కు రెడీ అయ్యేవారమని పేర్కొంది. మళ్లీ స్కూల్‌ టైమ్‌ అవ్వగానే సాయంత్రం బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌కు వెళ్లినట్లు తెలిపారు. తన చిన్ననాటి జీవితంలో సమయం సరిపోనందున ఫంక్షన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను బాల్యంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల త్యాగం, క్రమశిక్షణ, అంకితభావం సంకల్పం లాంటి అద్బుత లక్షణాలను పొందినట్లు అభిప్రాయపడ్డారు. అయితే అనూహ్యంగా ఓ మోడలింగ్‌ షోలో పాల్గొని, సినీ కెరీర్‌ వైపు దీపికా ఆసక్తి కనబరిచారు. కాగా బాలీవుడ్‌లో ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే సినీ విభాగంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే అగ్రస్థానం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.