బుల్లి తెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 సందడి మొదలైంది. తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన బిగెస్ట్ హిట్ షో ఆదివారం అట్టహాసంగా మొదలైంది. వరుసగా రెండోసారి వ్యాఖ్యాతగా వ్యవహించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున 16 మంది కంటెస్టెంట్లును బుల్లితెరకు పరిచయం చేశారు. అయితే వీరిలో చాలామంది వివిధ రంగాల్లో ప్రముఖ గుర్తింపు పొందినవారు కాగా... అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు గిరిజన పల్లెల నుంచి వచ్చిన గంగవ్వ. గంగవ్వను బిగ్ బాస్ హౌజ్‌లో చూడగానే ఆమె ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. షో మొదలవ్వడమే ఆలస్యం #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అంతేకాదు గంగవ్వ ఆర్మీ వచ్చేసిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణనే కాకుండా ఏపీ నుంచి కూడా ఆమెకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.