డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్.. ఫ్యూచర్ రిటైల్‌లో కంపెనీకి ఉన్న 1,78,47,420 షేర్లతోపాటు ప్రాక్సిస్ హోమర్ రిటైల్‌కు చెందిన 8,92,371 షేర్లను విక్రయించనుంది. ఒకేసారి/పలు దఫాలుగా బహిరంగ మార్కెట్, మర్చంట్ బ్యాంకర్‌ను నియమించడం ద్వారా, ఒకరు లేదా ఎక్కువ మంది కొనుగోలుదార్లకు ఈ వాటాలను అమ్మాలని శుక్రవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీ వైస్ చైర్పర్సన్, ఎండీ ఎన్.భువనేశ్వరికి బోర్డు అధికారాన్ని కట్టబెట్టింది. ఇదిలావుంటే శుక్రవారం హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.95 శాతం తగ్గి రూ.338.25 వద్ద స్థిరపడింది.