రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!


‘కొన్నేళ్లుగా మానసిక ఆందోళనతో బాధ పడుతూ అక్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని అధిక మొత్తంలో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాపానికి నేడు ఓ యువతిని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే’ అని బాలివుడ్‌ సినీ తార రియా చక్రవర్తిని మంగళవారం నాడు ‘నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో’ అరెస్ట్‌ చేయడం పట్ల ఆమె తరఫు న్యాయవాది సతీష్‌ మనెషిండే చేసిన వ్యాఖ్యలివి. రియా చక్రవర్తిని ప్రేమిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన బాలీవుడ్‌ వర్ధమాన హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఆ కేసులో ఇంతకుముందే ఏడుగురు అనుమానితులను అరెస్ట్‌ చేయగా మంగళవారం నాడు రియాను అరెస్ట్‌ చేశారు.