స్మాల్‌ క్యాప్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలకు డిమాండ్‌


ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 725 పాయింట్ల వరకూ పడిపోగా.. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో అధిక శాతం సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలు కావడం గమనార్హం! జాబితాలో శాస్కన్‌ టెక్నాలజీస్‌, శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌, సిగ్నిటీ టెక్నాలజీస్‌, రామ్‌కో సిస్టమ్స్‌, కనోరియా కెమికల్స్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం.. శాస్కన్‌ టెక్నాలజీస్‌ ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 644 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 684 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 17,900 షేర్లు చేతులు మారాయి. సిగ్నిటీ టెక్నాలజీస్‌ ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 383 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 410 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 29,000 షేర్లు చేతులు మారాయి.