మాటలు రావడం లేదు: చిత్ర భావోద్వేగం


‘‘ఒక శకం ముగిసింది. సంగీతం, ప్రపంచం ఇకపై మునుపటిలా ఉండబోవు. ఒక మంచి గాయనిగా పేరొందేలా నాకు మార్గనిర్దేశనం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆయన సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్‌, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఉద్వేగానికి లోనయ్యారు.