కోవిడ్‌ పరీక్షలపై కౌంటర్‌ దాఖలకు ఆదేశం


గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయడం లేదని దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయడంలేదని పిటీషనర్‌ హైకోర్టుకు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంకా బెడ్ల వివరాలను ఆయా ఆస్పత్రులు తమ డిస్‌ప్లేలో పెట్టడంలేదని కోర్టుకు తెలియజేశారు.