నటి జరీనాకి కరోనా


దక్షిణ, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ నటి జరీనా వహాబ్‌ కూడా కరోనా కారణంగా క్వారెంటైన్‌లో ఉన్నారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారం క్రితం చికిత్స కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకి చికిత్స అందించారు డాక్టర్లు. ఆస్పత్రిలో చేరిన ఐదు రోజులకే జరీనా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే జరీనాకి ఇంకా నెగటివ్‌ రాలేదు. ప్రస్తుతం హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్నారామె. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో జరీనా వహాబ్‌ నటించారు. తాజాగా రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో జరీనా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.