పలికే చిలుక మూగబోయింది..


బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.