ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌


వైరస్‌.. ఇప్పటికీ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. మొత్తం ప్రపంచాన్ని సుదీర్ఘకాలం స్తంభింపజేసిన ఈ వైరస్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ నిలిచిపోయిన ఒక్కొక్కటి గాడిన పడుతున్నాయి. అదే సమయంలో ఎంటర్‌మైన్‌ ఫీవర్‌ కూడా వచ్చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నిర్వహించే ఐపీఎల్‌తో పాటు తెలుగు ప్రేక్షక్షుల్ని అలరించడానికి బిగ్‌బాస్‌-4 కూడా సిద్ధమైంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ ప్రారంభం​ కాగా, ఐపీఎల్‌ మరో రెండు వారాల్లో ఆరంభం కానుంది. బిగ్‌బాస్‌ 15 వారాల పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధం కాగా, ఐపీఎల్‌ సుమారు రెండు నెలలు పాటు అలరించనుంది. ఈ రెండూ సుదీర్ఘమైన షెడ్యూల్‌లు కావడమే ఆయా యాజమాన్యాలను టెన్షన్‌ పెడుతోంది.