2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను రూ. 15 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే ఒక బౌలర్‌కు అన్ని కోట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ బౌలింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 3ఓవర్లలోనే 4 సిక్సులు, మూడు ఫోర్లు సమర్పించుకొని 49 పరుగులు ఇచ్చేశాడు. తొలి స్పెల్‌లో 5వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ను రోహిత్ ఒక ఆట ఆడుకున్నాడు. కమిన్స్ ఆ ఓవర్లో షార్ట్ బాల్స్ సంధించగా.. రోహిత్ రెండు బారీ సిక్స్‌లు బాదాడు.