మంత్రికీ టెస్ట్‌.. ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ  వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్‌ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో తనకూ గురువారమే కరోనా నిర్ధారణ పరీక్ష చేశారని, ఆ పరీ క్షలో నెగెటివ్‌ వచ్చిందన్నారు. రెండ్రోజుల త ర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు. ఏడుగురికి కరోనా పా జిటివ్‌ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. అయితే తనకు నెగెటివ్‌ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని ఈటల తెలిపారు.