మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు


విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఎవరి బ్యాటింగ్‌ స్టైల్‌ వారిది.. ఒకరిది దూకుడు స్వభావం అయితే..మరొకరు నెమ్మదైన స్వభావంతో కనిపిస్తారు. ప్రస్తుత తరంలో బ్యాటింగ్‌లో వండర్స్‌ క్రియేట్‌ చేసే ఈ ఇద్దరు పరుగులు చేయడంలో పోటీ పడతారేమో గాని గౌరవించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. 2019 ప్రపంచకప్‌ సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బ్యాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేదం ఎదుర్కొన్న స్మిత్‌ను ఉద్దేశించి భారత అభిమానులు గేలి చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న విరాట్‌ కోహ్లి.. మానిన పాత గాయాన్ని మళ్లీ గుర్తుచేయడం మంచి విషయం కాదు.. ఆ బాధ నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటూ క్లాప్స్‌తో ఎంకరేజ్‌ చేయాలంటూ తెలిపాడు. ఆరోజు స్మిత్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి దగ్గరికి వెళ్లి కృతజ్ఞత తెలిపాడు.