గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ ఢిల్లీ ఆకట్టుకుని నాకౌట్ రేసులో నిలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్‌లో ఓటమి పాలు కావడంతో ఫైనల్‌కు చేరాలన్న ఆశలకు గండిపడింది. ఈసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరతామనే ధీమాలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ యాజమాని పార్త్ జిందాల్ మాట్లాడుతూ.. గతేడాది తరహాలోనే తాము ఈసారి కూడా ప్లేఆఫ్ రేసులో కచ్చితంగా ఉంటామంటున్నాడు. తమ జట్టు ప్లేఆఫ్‌కు చేరే అన్ని అర్హతలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.