అదే తప్పు నేను చేస్తే ఎన్నేళ్ల నిషేధం పడేది?


యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నుంచి వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. పాబ్లో కార్రెనో బుస్టాతో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌ సహనం కోల్పోయాడు. తొలి సెట్‌లో 5-6తో వెనుకబడి ఉన్న సమయంలో జొకోవిచ్‌ అసహనానికి గురయ్యాడు. వరుసగా మూడు సెట్‌ పాయింట్లను కోల్పోవడంతో బంతిని తీసుకుని మహిళా లైన్‌ జడ్జిపై కొట్టాడు. అది ఆమెకు బలంగా తగలడంతో విలవిల్లాడిపోయింది. ఈ అనూహ్య పరిణామంతో జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం కోర్టును వీడాల్సి వచ్చింది. దాంతో ఈ యూఎస్‌ ఓపెన్‌లో ఇప్పటివరకూ సాధించిన రేటింగ్‌ పాయింట్లను సైతం జొకోవిచ్‌ కోల్పోయాడు.