కేబీసీ సీజన్‌ 12: చలించిపోయిన అమితాబ్‌


బిగ్‌ బీ అబితాబ్‌ వ్యాఖ్యాతగా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) 12 వ సీజన్‌ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ షోలో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపించే బిగ్ ‌బీ సబితా లైఫ్‌ జర్నీ గురించి తెలుసుకుని విచలితుడయ్యారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్‌ కొనియాడారు. ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్‌ 12, ఆరో ఎపిసోడ్‌ సోనీ టీవీలో నేటి రాత్రి (మంగళవారం) ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఎపిసోడ్‌ అందుబాటులో ఉంది.