సదాశివపేట పట్టణంలో తెలంగాణ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు.

 


అందరికీ ఆదర్శనీయుడు మహాత్మా గాంధీ.

నేటి యువత గాంధీ అడుగుజాడల్లో నడవాలి.

దొడ్ల.వెంకట్, టీ జి ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు


జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నీ పురస్కరించుకొని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో మహాత్మాగాంధీ 151 వ జన్మదినం సందర్భంగా టి జి ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల వెంకట్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా గాంధీ జయంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్ల.వెంకట్ మాట్లాడుతూ... భారతదేశ స్వాతంత్ర్య  సమరంలో  1857 నుండి ఎంతో మంది మహనీయులు పోరాడి అమరులైపోయ్యారు చివరకు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో దేశానికి స్వతంత్రం సిద్ధించింది. అలాంటి మహనీయుని జన్మదినాన్ని మనం అందరం ఒక్క పండుగలా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని దేశ ప్రజలందరికి తన జీవితాన్నే పాఠంగా అందించిన గాంధీ గారి ఆశయాలను నేటి యువత ఆచరించకపోవడం దురదృష్టకరం అని, గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టిన వారికి ఎప్పుడు ఓటమి ఉండదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలని అని ఆయన అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు కె. వెంకట్ రెడీ, కే.బాస్వరాజ్ ,కొల్కుర్ ప్రతాప్ సురేశ్, లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ.. గాంధీ గారు తన జీవితాన్నే తన సందేశంగా ప్రతి ఒక్కరూ భావించి ఆచరణలో పెట్టినప్పుడే నా యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది అని, నీతి నిజాయితీ తో ఉండాలని, యువత ఎల్లప్పుడూ సామాజిక కార్యక్రమాల్లో  ముందుడాలని భావించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరేష్,రాజు, సిందొల్ ప్రశాంత్, జగత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.