రాష్ట్రంలో కొత్తగా 1,718 మందికి కోవిడ్‌ పాజిటివ్‌


రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండులక్షలకు చేరువవుతోంది. కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,97,327కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 1,67,846 మంది కోలుకోగా శుక్రవారం ఒక్కరోజే 2,002 మంది కోలుకున్నారు. కోవిడ్‌–19తో మరో ఎనిమిది మంది మరణించగా ఇప్పటివరకు నమోదైన మరణాలు 1,153కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 28,328 యాక్టివ్‌ కేసులుండగా, ఇందులో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49,084 మందికి పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు మొత్తం 31,53,626 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 84,729 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తీసుకున్న శాంపిల్స్‌లో 994 మందికి సంబంధించి రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.