తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2020 ఫలితాలు రేపు విడుదల తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2020 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్షను అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 30,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి రేపు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలోని యునివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు.