2020–21 భారత్‌ ఎకానమీపై ప్రపంచ బ్యాంక్‌ అంచనా  భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్‌)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్‌ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్‌ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారత స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ తాజా నివేదిక విడుదలైంది.