ధర రూ.2,500–3,000 మధ్యలో

 


 దేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన జియో... అతి తక్కువ ధరకే ఈ ఫోన్లను కస్టమర్లకు అందించాలని భావిస్తోంది. కంపెనీ అధికారుల సమాచారం మేరకు... 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.5వేల లోపే ఉంటుందని, క్రమంగా ఈ ధరను రూ.2,500–3,000 స్థాయికి తగ్గించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో 2జీ కనెక్షన్లను వినియోగిస్తున్న 20 నుంచి 30 కోట్ల వినియోగదారుల లక్ష్యంగా ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల తయారీని జియో చేపట్టి్టంది. ప్రస్తుతం భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.27000లుగా ఉంది. భారత్‌ను 2జీ ఫ్రీ దేశంగా తీర్చేదిద్దడమే తమ లక్ష్యమని రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ కంపెనీ ఇటీవల జరిగిన 43వ వార్షికోత్సవంలో ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే.