కరోనా మహమ్మారి అంతానికి రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా అనుమతి మేరకు భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించ నున్నామని ఇరు సంస్థలు శనివారం ప్రకటించాయి.