డోజోన్స్‌ 466- నాస్‌డాక్‌ 257 పాయింట్లు జూమ్‌


అధ్యక్షుడు ట్రంప్‌ సైతం కోవిడ్‌-19 బారిన పడటంతో వారాంతాన నమోదైన నష్టాలకు చెక్‌ పెడుతూ సోమవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌ 466 పాయింట్లు(1.7%) ఎగసి 28,149 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 60 పాయింట్లు(1.8%) బలపడి 3,409 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 257 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 11,332 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కోలుకోవడంతో తిరిగి ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్‌ పట్టుబడుతున్న ప్యాకేజీపై ఒప్పందం కుదిరేవీలున్నట్లు వైట్‌హౌస్‌ చీఫ్‌ మార్క్‌ మెడోస్‌ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.