బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా..51.91శాతం పోలింగ్‌బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91శాతం పోలింగ్‌ నమోదైంది. 71 శాసనసభ స్థానాల్లో 1066 మంది భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించారు. కొవిడ్‌ నేపథ్యం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్‌ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 71 స్థానాల్లో వెయ్యి మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలిదశలో ఆర్జేడీ 42, జేడీయూ 41, ఎల్‌జేపీ 41, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21 స్థానాల్లో బరిలో నిలిచాయి. తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి షూటర్‌ శ్రేయాసి నయాగావ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.