గ్రామాల్లో 62.51 లక్షల ఆస్తులు  గ్రామ పంచాయతీల్లో ఆస్తుల నమోదు మెల్లిగా ఊపందుకుంటోంది. గ్రామీణ ప్రాం తాల్లో 62,51,990 ఆస్తులు ఉండగా.. ఇందులో సోమవారం నాటికి 38,83,165 ఆస్తుల వివరా లను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అంటే 62% ఆస్తులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. సాగు, వ్యవ సాయేతర ఆస్తుల నమోదుకు ధరణి పోర్టల్‌ను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన సర్కారు.. ఈ దసరా నుంచి వీటిని అందుబాటు లోకి తేవాలని ముహూర్తం ఖరారు చేసింది. సాగు భూములను తహసీళ్లలో... వ్యవసాయేతర ఆస్తులను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో ఆస్తుల రికార్డులను పకడ్బందీగా నిర్వహించా లని భావించి.. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్‌పుస్తకాలను జారీ చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ప్రతి ఆస్తిని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ.. ఇప్పటికే ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటూ ఇంటింటికి వెళ్లి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం వివరాలను సేకరిస్తోంది. ఇంటి యజమాని ఫొటో, ఆధార్, ఫోన్‌ నంబర్‌ తదితర సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తోంది. ఇలా సేకరించిన సమాచారాన్ని ధరణి పోర్టల్‌తో అనుసంధానించనుంది.