‘6 పరుగులు సేవ్‌ చేయడం మామూలు కాదు’

 


 ఐపీఎల్‌ అంటేనే వినోదాల విందు. అందులోనూ సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలడం అంటే ఉత్కంఠగా మ్యాచ్‌ సాగినట్టే. అభిమానులకు ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసినట్టే. మరి సూపర్‌ ఓవర్‌ కూడా టై గా ముగిసి రెండో సూపర్‌ కూడా ఆడితే.. ఆ మజా మరింత ‘సూపర్‌’గా ఉంటుంది. పంజాబ్‌, ముంబై జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ దీనికి వేదికైంది. ఐపీఎల్‌ చరిత్రలోనే మొదటిసారి సూపర్‌+సూపర్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి పంజాబ్‌ జట్టు సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది.