కరోనా: 70 శాతం మందికి లక్షణాల్లేవ్‌

 

 రాష్ట్రంలో లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారు 70 శాతం మంది ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకు డు డాక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కరోనా బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,49,925 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,08,535 మంది కరోనా బారినపడ్డారని, వీరిలో 1,45,974 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. మిగి లిన 62,561 మంది ల„క్షణాలతో వైరస్‌ బారి న పడినట్లు వెల్లడించారు. ఇక శుక్రవారం 53,086 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,891 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక రోజులో 1,878 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,80,953కి చేరుకుంది. శుక్రవారం ఏడుగురు చనిపోగా, ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.57 శాతముంది. అలాగే దేశంలో కోలుకున్నవారి రేటు 85.5 శాతం ఉండగా, తెలంగాణలో 86.77 శాతముందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 26,374 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌ లో 21,801 మంది ఉన్నారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 92,690 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.