ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి 8 శాతం క్షీణత  కఠిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆగస్టులోనూ కొనసాగిందని సోమవారం విడుదలైన అధికారిక పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడించాయి. సమీక్షా నెలలో 8 శాతం క్షీణత (2019 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. అయితే కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న తాజా గణాంకాలను మహమ్మారి వ్యాప్తి ముందు నెలలతో పోల్చి చూడడం తగదని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వరకూ వెయిటేజ్‌ ఉన్న తయారీసహా విద్యుత్, మైనింగ్‌ రంగాలు ఆగస్టులో తీవ్ర నిరాశపరిచాయి.