వివిధ కంపెనీల ట్రేడ్‌మార్క్‌లను ఉల్లంఘించి పాన్‌ మసాలా తయారీ  ప్రముఖ వ్యాపారవేత్త, సినీ హీరో అయిన సచిన్‌ జోషిపై హైదరా బాద్‌లో మరో ‘గుట్కా’ కేసు నమోదైంది. ట్రేడ్‌మార్క్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాన్‌ మసాలా తయారు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సచిన్‌తోపాటు ఆయన తండ్రి, గోవా పాన్‌ మసాలా కంపెనీ యజమాని జేఎం జోషిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. గగన్‌పహాడ్‌లో వారు నిర్వహి స్తున్న గోల్డెన్‌ ఫింగర్స్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీపై దాడులు చేసి రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకును స్వాధీనం చేసుకు న్నారు. అలాగే కంపెనీని సీజ్‌ చేశారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం జేఎం జోషి, సచిన్‌ జోషిలు గగన్‌ పహాడ్‌లో గోల్డెన్‌ ఫింగర్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్‌ కంపెనీకి చెందిన మాణిక్‌ చంద్‌ పాన్‌ మసాలాను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేస్తున్నారు.