నవ్వించడానికి రెడీ

 


 రణ్‌వీర్‌ సింగ్‌ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్‌ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్‌వీర్‌తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్‌’ (1982) చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకున్నారు రోహిత్‌ శెట్టి. హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్‌వీర్‌ది డబుల్‌ రోల్‌. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్‌ చేయబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్‌ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.