ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో జబర్దస్త్ విజయాన్ని సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ను 18.1 ఓవర్లలో 136 ఆలౌట్ చేసి మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ను ఏ దశలోనూ తేరుకోనివ్వకుండా చేసి విజయకేతనం ఎగురవేసింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లలో జోస్ బట్లర్(70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఎవరు రాణించకపోవడంతో ఘోర ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్, పాటిన్‌సన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రాహుల్ చాహర్, పొలార్డ్‌లకు తలో వికెట్ లభించింది. తాజా విజయంతో ముంబై నాల్గో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్కు చేరింది.