గూగుల్‌ పే యాపిల్ స్టోర్ నుండి తొలగింపు

 


యాపిల్ ఫోన్ యూజర్లలో కొంతమందికి గూగుల్ పే ట్రాన్సక్షన్స్ ఫెయిల్ అవుతుండడం.. యూజర్ల నుంచి ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదులు రావడంతో యాపిల్ యాప్ స్టోర్ నుంచి తాత్కాలికంగా గూగుల్ పే యాప్ ను తొలగించబడింది. ఆండ్రాయిడ్ వర్షన్ లో మాత్రం గూగుల్ పే యాప్ అందుబాటులోనే ఉందని వెల్లడించారు గూగుల్ పే ప్రతినిధులు. వీలైనంత త్వరలోనే యాప్ స్టోర్‌లో ఉండే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు.